The agony of Amaravati farmers : రాష్ట్రంలోని పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తామ వ్యతిరేకం కాదని అమరావతి రైతులు మరోసారి స్పష్టం చేశారు. ఏ గ్రామంలోని పేదలకు.. ఆ ఊర్లోనే ఐదు సెంట్ల స్థలం ఇవ్వాలని రైతుల డిమాండ్ చేశారు. సెంటు భూమి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన ఇంటిని ఎకరం స్థలంలో నిర్మించుకుంటే.. పేదలకు ఒక సెంటు స్థలం ఏ మాత్రం సరిపోతుందని రైతులు మందడంలో ప్రశ్నించారు. గత ప్రభుత్వం పేదల కోసం రాజధానిలో ఐదు శాతం భూమిని కేటాయించిందని... అందులో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన ఆర్ 5 జోన్ లో చిన్న మధ్య తరహా పరిశ్రమలు వస్తాయని.. సెంటు భూమి ప్రతిపాదనతో అవన్నీ వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని రైతులు పేర్కొన్నారు.
ఇళ్ల పేరుతో పేద ప్రజలను సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోమారు మోసం చేస్తున్నారు. సెంటు స్థలంలో బాత్ రూం, ఎకరం స్థలంలో ఇల్లు కట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి.. పేద ప్రజలు, దళితులకు కేవలం సెంటు స్థలంలో ఇల్లు కట్టిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలంతా తాము ఇప్పటికే నివసిస్తున్న ప్రాంతం, గ్రామంలోనే ఐదు సెంట్ల స్థలం ఇవ్వాలని పోరాడాలి. వారికి మద్దతుగా మేం కూడా పాల్గొంటాం. ఇళ్లు కట్టుకునేందుకు రుణ సౌకర్యం కూడా కల్పించాలి. - కంభంపాటి శిరీష, రైతు రాయపూడి