తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది రైతులు, మహిళలు తుళ్లూరు నుంచి బయలుదేరగా... వారిని మార్గ మధ్యలో అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. పోలీసుల బారికేడ్లు, రోప్‌లు వారిని అడ్డుకోలేకపోయాయి. కట్టలు తెగిన ఆవేదన, ఆందోళనతో రైతులు, మహిళలు... గుట్టలు, ముళ్ల పొదల్లో కిలో మీటర్ల దూరం ప్రయాణం చేశారు. రైతులు, మహిళల పాదయాత్ర నిలువరించేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. చివరకు అసెంబ్లీ రెండో గేటు వరకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు వారిని నిలువరించారు. మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలు తమకు ఆమోదయోగ్యం కాదని రైతులు స్పష్టం చేశారు.
'అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలి'
తుళ్లూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు, మహిళలు అసెంబ్లీని ముట్టడించటానికి బయలుదేరారు. మార్గమధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి పాదయాత్రను నిలువరించ లేకపోయారు. అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలని...లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తుళ్లూరులో పెద్ద ఎత్తున్న అసెంబ్లీ ముట్టడి