Farmers Innovative Protest as Amaravati Movement Completes Four Years:రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా తుళ్లూరు ధర్నా శిబిరం వద్ద జెండావందనం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలని కోరుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో కలిసి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అమరావతి ఉద్యమ అమరవీరులకు రైతులు, మహిళలు నివాళులర్పించారు.
ఉద్యమం నాలుగేళ్లు పూర్తైనా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి మేలుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయపక్షాలకు చెందిన ప్రతినిధులు, న్యాయవాదులు తరలివచ్చి అమరావతి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించేవరకూ తమ ఉద్యమం ఎన్నాళైనా కొనసాగుతుందని రైతులు, మహిళలు స్పష్టంచేశారు.
రాజధాని రైతులపై ప్రభుత్వం ప్రతీకార చర్యలు - నాలుగేళ్లలో 3 వేల మందిపై కేసులు
Nara Lokesh Supports Amaravati Farmers Protests:నాలుగేళ్లుగా నిర్విరామంగా రాజధాని రైతులు చేస్తున్న నిరసనలకు (Amaravati farmers protest) నారా లోకేశ్ మద్దతు తెలిపారు. మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని సైకో జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లైందని ధ్వజమెత్తారు. వేల కోట్ల విలువైన భవనాలు శిథిలం చేసి భూములు ఇచ్చిన రైతుల్ని దారుణ హింసలు పెట్టాడని మండిపడ్డారు. ఇన్ని చేసినా రాజధానిని అమరావతిని ఇంచు కూడా కదపలేకపోయారన్నారు. సైకో జగన్ అరాచక పాలన మరో మూడు నెలల్లో పోతుందని రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందన్నారు.