Amaravathi farmers yagam: పేద ముఖ్యమంత్రిని, పేదల పక్షపాతిని అని చెప్పుకునే జగన్ కి.. అమరావతి పేదలు కనిపించరా అంటూ రాజధాని మహిళ రైతులు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలనితుళ్లూరు మండలం మందడంలోరైతులు సుదర్శన యాగం చేశారు. పెత్తందారు జగన్ కి అమరావతి రైతులకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ పాల్గొని పూజలు నిర్వహించారు. లిబియా మాజీ నేత గడాఫీకి పట్టిన గతే జగన్ కి కూడా పడుతుందని మండిపడ్డారు. అమరావతి మహిళా రైతుల కన్నీటి కడలిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనిసాగాలంటూ రైతులు, మహిళలు తుళ్లూరు మండలం మందడంలో శ్రీలక్ష్మీ గణపతి పూజ, సుదర్శనయాగం నిర్వహించారు. సోమవారం ఆర్ 5 జోన్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అమరావతికి న్యాయం దక్కాలంటూ ఈ పూజలు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని జగన్ పై ఉమమహేశ్వరరావు నిప్పులు చెరిగారు. లిబియా మాజీ నేత గడాఫీ పట్టిన గతే జగన్ కు పడుతుందన్నారు. జగన్ ప్రభుత్వానికి ఎక్స్పైర్ డేట్ వచ్చేసిందన్నారు.
ఐదు కోట్ల మంది ప్రజలు తమ రాష్ట్ర రాజధాని ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ అమరావతి రైతుల ఉసురు, మహిళల కన్నీటిలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం. - దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నేత