ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్ట పరిహారంపై మాట్లాడుకుందాం రండి.. రాజధాని రైతులతో సీఆర్డీఏ అధికారులు - embankment expansion works

Construction of embankment: కరకట్ట నిర్మాణం నేపథ్యంలో పరిహారంపై చర్చించేందుకు ఈనెల 13, 14 తేదీల్లో తుళ్లూరులోని తమ కార్యాలయానికి రావాలని రైతులకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతకుముందు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పనులు చేపట్టడంతో రైతులు అడ్డుకోవడంతో అధికారులు దిగి వచ్చారు.

కరకట్ట నిర్మాణం
కరకట్ట నిర్మాణం

By

Published : Feb 10, 2023, 6:10 PM IST

Construction of embankment: రాజధాని ప్రాంతంలో కీలకమైన కరకట్ట విస్తరణ పనులను రైతులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టను అనుకొని ఉన్న పొలాలకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టవద్దని రైతులు ఫ్లెక్సీలు కట్టారు. గతేడాది జూన్ నెలోలో ఇదే సమస్య ఉత్పన్నం కావడంతో సీఆర్డీఏ అధికారులు.. రైతులతో చర్చలు జరిపారు. 2003 భూ సేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్​ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అప్పట్లో సమావేశం ముగించారు.

తాజాగా రైతుల పొలాల్లోని అరటి చెట్లను నిర్మాణ సంస్థ ప్రతినిధులు జేసీబీలతో తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. పనులను అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్డీఏ అధికారులు.. పరిహారంపై చర్చించేందుకు ఈనెల 13, 14 తేదీల్లో తుళ్లూరులోని తమ కార్యాలయానికి రావాలని రైతులకు సూచించారు.

నష్ట పరిహారంపై మాట్లాడుకుందాం రండి.. రాజధాని రైతులతో సీఆర్డీఏ అధికారులు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details