మిర్చి కల్తీ విత్తనాలతో నష్టపోయిన తమకు పరిహారం అందించాలంటూ పెదకూరపాడు రైతులు గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారులను కోరారు. ఈమేరకు పంట దెబ్బతిన్న బాధితులు.. కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ విజయభారతిని కలిసి వినతిపత్రం అందించారు.
కళాశ కంపెనీకి చెందిన విత్తనాలు వేసి పంటలో పువ్వు, కాయ రాక.. తీవ్రంగా నష్టపోయామన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని.. విత్తన సంస్థ నుంచి పరిహారం ఇప్పించాలని మిర్చి రైతులు వేడుకున్నారు. పంటకు సంబంధించి నివేదిక అందాల్సి ఉందని.. అనంతరం తదుపరి చర్యలు చేపడతామని వ్యవసాయ శాఖ జేడీ హామీ ఇచ్చారు.