గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. తమ గోడును ప్రభుత్వం వినిపించుకోవడం లేదంటూ ఓ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. రాజధాని కోసం 19రోజులుగా తాము దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని... అందుకే దున్నపోతుకి వినతిపత్రం ఇచ్చామని రైతులు తెలిపారు. అన్నదాతలను పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చిన నటుడు పృథ్వీరాజుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకొని నటించే ఆయనే అసలైన పెయిడ్ ఆర్టిస్టు అని మండిపడ్డారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా... దున్నపోతుకు వినతిపత్రం - ఏపీకి మూడు రాజధానులు
రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వతీరును నిరసిస్తూ మంగళగిరి మండలంలో రైతులు వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. వైకాపా సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమను పెయిడ్ ఆర్టిస్ట్లు అన్న నటుడు పృథ్వీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
farmers gave Memorandum to a male buffalo