తుపానులు, దళారుల మోసంతో రైతన్నలకు కష్టం మాత్రమే మిగులుతోంది. పంటచేతికొచ్చే వేళ నివర్ తుపాను రైతుల ఆశలపై నీళ్లు చల్లంది. అదే సమయంలో తుపాను నుంచి రక్షించుకున్న పంటను ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు అమ్ముకుందామంటే దళారులు రైతులను నిట్టనిలువునా దోపిడి చేస్తున్నారు.
ధాన్యం తడిసిందని... రంగుమారిందనే సాకులతో బస్తా రూ.1100లకు మించి ఇవ్వలేమంటూ దళారులు తెగేసి చెబుతున్నారు. మరో రెండు తుపానులు వస్తున్నాయని... ఈ సారి ఆ మాత్రం ధర కూడా రాదని రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. చేసేదేమీ లేక రైతులు రూ.1500 విలువ చేసే బస్తాను రూ.400లకే అమ్మకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.