నివార్ తుపాన్ వస్తోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున గుంటూరు జిల్లాలో రైతులు అప్రమత్తమయ్యారు. పొలాల్లో కోసి ఉన్న వరిపంటను హడావుడిగా నూర్పిస్తున్నారు. తుపాను కారణంగా ఈదురుగాలులు, భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందుకే పొలాల్లో ఉన్న వరికుప్పల్ని నూర్పిడి చేయిస్తున్నారు. వర్షం వచ్చేలోగా నూర్పిడి పూర్తి కావాలనే ఉద్దేశంతో యంత్రాలను వినియోగిస్తున్నారు. అలాగే నూర్పిడి తర్వాత వచ్చిన ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. తుపాన్ తీవ్రంగా ఉంటే పొలాల్లో ఉన్న వరి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
నివార్ తుపాన్ హెచ్చరిక.. అప్రమత్తమైన రైతన్నలు
నివార్ తుపాన్ హెచ్చరికలతో గుంటూరులో రైతన్నలు అప్రమత్తమయ్యారు. పంట పాడవకుండా, తొందరగా నూర్పిడి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వరిపంటను కోయలేదు. తుపాను వల్ల పంటను నష్టపోయేప్రమాదం ఉంది.
నివార్ తుపాన్ హెచ్చరిక