ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలి మార్కెట్​ యార్డ్​ వద్ద నిమ్మ రైతుల ఆందోళన - తెనాలి మార్కెట్​ యార్డ్​ వద్ద రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్​ యార్డ్​ వద్ద నిమ్మ రైతులు ఆందోళన చేపట్టారు. పంట కొనుగోళ్లలో ఆన్​లైన్​ విధానం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు. దీనిపై మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​ హామీ ఇచ్చారు.

మార్కెట్​ యార్డ్​ వద్ద రైతుల ఆందోళన

By

Published : Oct 28, 2019, 7:50 PM IST

తెనాలి మార్కెట్​ యార్డ్​ వద్ద నిమ్మ రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్​ యార్డు వద్ద నిమ్మ రైతులు ఆందోళనకు దిగారు. పంట కొనుగోళ్లలో ఆన్​లైన్​ విధానం తప్పులతడకగా ఉందంటూ నిరసన చేపట్టారు. దీనిని పట్టించుకోని అధికారులు సాయంత్రం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​ రాకతో... కర్షకులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం తెచ్చిన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మార్కెటింగ్​ శాఖ జేడీ రామాంజనేయులు అన్నారు. సమస్య పరిష్కరించే దిశగా మంత్రి, కమిషనర్​తో చర్చలు జరుపుతానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​ హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details