గుంటూరు జిల్లా వినుకొండలో విషాదం నెలకొంది. విష్ణుకుండి నగర్‌కు చెందిన ఎర్రబోతు వీరాంజనేయులు అనే యువ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎన్ఎస్పీ కాలువ నుంచి వస్తున్న లీకేజీ నీటిని తన చేనులోకి మరల్చుతుండగా.. మున్సిపల్ సిబ్బంది వచ్చి లీకేజీని పూడ్చమని హెచ్చరించారు. వీరాంజనేయులు లీకేజిని పూడ్చుతుండగా.. పోటోలు తీసి కమిషనర్‌కు తెలిపారు.
కమీషనర్ పోలీసులుకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడకు చేరుకుని వీరాంజనేయులును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో మనస్థాపానికి గురైన రైతు.. తన పొలంలో ఎడ్లు ఉన్నాయని వాటిని ఇంటి వద్ద వదిలేస్తారని స్టేషన్లో తెలిపి.. పొలానికి వచ్చి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.