గుంటూరు జిల్లా జంపనిలో అప్పుల బాధలు తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఎకరాలు కౌలుకు తీసుకున్న శ్రీనివాసరావు.. 4 ఎకరాల్లో నిమ్మతోట, 3 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య - ఏపీలో రైతు ఆత్మహత్యలు న్యూస్
అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వేమూరు మండలంలోని జంపనీలో చోటుచేసుకుంది.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య