గుంటూరు జిల్లా మాచర్ల మండలం చింతల తండాకు చెందిన సీతానాయక్ అనే రైతుకు వారసత్వంగా రెండెకరాల పొలం వచ్చింది. ఇది తన తండ్రి పేరు మీద ఉంది. అయితే దాన్ని తన పేరు మీదకు మార్చి ఆన్లైన్లో నమోదు చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ అనేకసార్లు తిరిగాడు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఈ క్రమంలో విసుగెత్తిన రైతన్న తన భూమిని ఆన్లైన్లో నమోదు చేయకపోతే.. అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు.
'నాకు మా నాన్న నుంచి 2 ఎకరాల పొలం వారసత్వంగా వచ్చింది. అది నా పేరుమీదకు మార్చాలంటూ ఎన్నోసార్లు రెవెన్యూ కార్యాలయానికి వచ్చాను. అధికారులు ఏదో ఒకటి చెప్పి పంపించేస్తున్నారు. ఇప్పటికీ నా పని కాలేదు. ఇప్పుడైనా పని అవ్వకపోతే అధికారుల పేర్లు రాసి పెట్టి పురుగుల మందు తాగి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం.'