గుంటూరు జిల్లా తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ తగిలింది. ఆసరా కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసేందుకు తుళ్లూరుకు వచ్చిన శాసనసభ్యురాలిని కౌలు విషయమై నిలదీశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రైతుల సంక్షేమం కోసం శాసనసభ్యురాలు ఎందుకు చొరవ తీసుకోవటం లేదని మండిపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని సదరు రైతును అక్కడినుంచి పక్కకు తీసుకెళ్లారు.
కౌలు కావాలంటూ ఎమ్మెల్యేను నిలదీసిన రైతు - ఉండవల్లి శ్రీదేవి తాజా వార్తలు
ఆసరా కార్యక్రమంలో భాగంగా చెక్కులు పంపిణీ చేసేందుకు గుంటూరు జిల్లా తుళ్లూరుకు వచ్చిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ తగిలింది. పెట్టుబడి సాయం విషయమై ఓ రైతు ఎమ్మెల్యేను నిలదీశారు.
![కౌలు కావాలంటూ ఎమ్మెల్యేను నిలదీసిన రైతు పెట్టుబడి సాయం విషయమై ఎమ్మెల్యేను నిలదీసిన రైతు !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8800288-651-8800288-1600093214424.jpg)
పెట్టుబడి సాయం విషయమై ఎమ్మెల్యేను నిలదీసిన రైతు !
Last Updated : Sep 15, 2020, 7:50 AM IST