ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు కుమారుడు జయరాం కన్నుమూత - Former Minister Nakka Anandababu

అనారోగ్యంతో రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు తనయుడు జయరాం అనారోగ్యంతో మృతిచెందారు. జయరాం మృతదేహానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

farmer mp venkatrav son jayarao died in thenali guntur district
మాజీ ఎంపీ వెంకట్రావు కుమారుడు జయరాం కన్నుమూత

By

Published : Apr 2, 2021, 9:38 PM IST

రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావుకు పుత్ర వియోగం కలిగింది. ఆయన కుమారుడు జయరాం శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. రెండు సంవత్సరాల క్రితమే జయరాం భార్య హిమకుమారి అనారోగ్యంతో మృతిచెందడంతో వెంకట్రావు కుటుంబంలో విషాదం అలుముకుంది.

జయరాం గుంటూరు జిల్లా తెనాలిలో ఎల్ఎల్​బీ పూర్తి చేసి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం తెనాలి కోర్టులో ప్రాక్టీస్ చేశారు.

యడ్లపాటి జయరాం మరణంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యడ్లపాటి వెంకట్రావును చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. జయరాం మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు. జయరాం భౌతిక కాయానికి నివాళులర్పించారు.

ఇదీచదవండి.

సికింద్రాబాద్-రేపల్లె డెల్టా రైలు పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details