కారు ఢీకొని రైతు మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో శనివారం సాయంత్రం జరిగింది. భట్టిప్రోలు గ్రామానికి చెందిన పి.వెంకట సుబ్బారావు(51) తన పొలంలో వరి నూర్పిల్లు చేయిస్తున్నారు. కూల్డ్రింక్స్ తీసుకొచ్చేందుకు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా... గ్రామ శివారులో అతి వేగంగా వచ్చిన కారు వెంకట సుబ్బారావు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పొలాల్లోకి ఈడ్చుకెల్లింది. వెంకట సుబ్బారావు అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడపడం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రైతు ప్రాణాన్ని బలిగొన్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
కారు-బైక్ ప్రమాదంలో రైతు మృతి - Guntur District Crime news
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో శనివారం సాయంత్రం కారు-ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ రైతు మృతిచెందాడు. ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ మద్యం తాగడమేనని స్థానికులు చెబుతున్నారు.
![కారు-బైక్ ప్రమాదంలో రైతు మృతి కారు-బైక్ ప్రమాదంలో రైతు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11693131-178-11693131-1620531593208.jpg)
కారు-బైక్ ప్రమాదంలో రైతు మృతి