ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌలు రైతులకు నష్టం.. రైతు తీర్చిన కష్టం - కౌలు డబ్బులు

కౌలు రైతుల దీనస్థితిని చూసి చలించాడు రైతు. కష్టకాలంలో వారికి అండగా నిలిచారు. వారి నష్టాన్ని పంచుకుని పెద్ద మనసును చాటుకున్నారు. అధికారుల అభినందనలు పొందారు.

tenent farmer
రైతు తీర్చిన కష్టం

By

Published : Nov 19, 2020, 3:42 PM IST

గుంటూరు జిల్లాలో ఓ రైతు పెద్దమనసు చాటుకున్నారు. కొల్లిపర గ్రామానికి చెందిన శివారెడ్డి అనే రైతుకు ఐదు ఎకరాల భూమి ఉంది. స్థానికులైన కేశన గోవిందు, పున్నారెడ్డికి ఆ భూమిని కౌలుకు ఇచ్చారు. పంట వేయడానికి ముందే కౌలు డబ్బులు రైతుకు చెల్లించారు. పొలం సాగు చేశారు. కృష్ణా నది వరద పోటెత్తి పంటలు మునిగి పాడైపోయాయి.

కౌలు రైతుల దీనస్థితి గమనించిన రైతు శివారెడ్డి.. వాళ్లు తనకిచ్చిన మొత్తాన్ని తహసీల్దార్ నాంచారయ్య సమక్షంలో తిరిగి ఇచ్చేశారు. వారి కష్టంలో, నష్టంలో పాలుపంచుకున్నారు. రైతు పెద్దమనసుని అధికారులు, స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి: భూ సేకరణ ప్రక్రియకు రైతులు సహకరించాలి: ఎమ్మెల్యే శంకరరావు

ABOUT THE AUTHOR

...view details