ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూమి సాగు చేయనీయట్లేదని తహసీల్దార్​పై ఎస్పీకి ఫిర్యాదు - Complaint on Chilakaluripeta Tahasildar over land issue

గుంటూరులో ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూముల్లో వ్యవసాయం చేసుకోనీయకుండా తహసీల్దార్ అడ్డుకుంటున్నారని... చింతా సాంబయ్య అనే రైతు జిల్లా గ్రామీణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని వారు విన్నవించుకున్నారు.

SP
ఎస్పీకి ఫిర్యాదు

By

Published : Jan 19, 2021, 12:38 PM IST

ప్రభుత్వం కేటాయించిన భూమిని సాగు చేయనీయకుండా చిలకలూరిపేట తహసీల్దార్ అడ్డుపడుతున్నారని... చింతా సాంబయ్య అనే రైతు గుంటూరు గ్రామీణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

చిలకలూరిపేట మండలంలోని బొప్పూడికి చెందిన సాంబయ్య, మరికొందరు రైతులతో కలిసి గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీని కలిశారు. 2007లో తనతోపాటు కొందరు రైతులు, మాజీ సైనికులకు ప్రభుత్వం భూములు ఇచ్చిందన్నారు. వాటిని సాగు చేసుకుంటుంటే... సర్కార్ భూములని చెప్పి అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పొలంలోకి వెళ్లనీయకుండా అధికారులు అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు.

ఆ భూముల్లో గ్రానైట్ నిల్వలు ఉన్నట్లు తేలటంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు కొందరు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. అందుకు అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని... వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కరోనా టీకా తప్పనిసరా? తీసుకోకపోతే ఏమవుతుంది?

ABOUT THE AUTHOR

...view details