గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామం యం.పి.ఈ.ఓ దివ్యపై షేక్ మస్తాన్ అనే రైతు దాడి చేశాడు. దివ్య రైతు భరోసా పథకం కోసం రైతుల నుండి వివరాలు సేకరిస్తుండగా... షేక్ మస్తాన్ తన కూతురి పేరు కూడా పథకంలో నమోదు చేయాలని కోరారు. అయితే కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు అని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రైతు ఆమెపై చేసుకున్నారని...దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యవసాయ అధికారిణి సంధ్యారాణి తెలిపారు. రైతుపై స్థానిక పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు...ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యులు తీసుకోవాలని ఆమె కోరారు.
వ్యవసాయ అధికారిపై రైతు దాడి..పోలీసులకు ఫిర్యాదు - farmer fires on mpeo at guntur district
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో యం.పి.ఈ.ఓపై రైతు దాడి చేశాడు. మాదినపాడు గ్రామంలో రైతుల వివరాలు సేకరిస్తున్న క్రమంలో షేక్ మస్తాన్ అనే రైతు తన కూతురి పేరు కూడా పథకంలో నమోదు చేయాలని కోరారు. అయితే కుటుంబంలో ఒక్కరు మాత్రమే పథకంలో అర్హులు అని చెప్పడంతో రైతు ఈ దుశ్చర్యకి పాల్పడ్డాడు.

యం.పి.ఈ.ఓపై దాడి చేసిన రైతు