ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాడిగలో మేలు రకానికి రికార్డు ధర.. ఆనందంలో రైతు - గుంటూరు మిర్చియార్డు వార్తలు

గుంటూరు మిర్చియార్డులో.. బాడిగలోని మేలు రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ రకం మిర్చి క్వింటా రూ.36వేలకు అమ్ముడుపోయింది. మొత్తం 131బస్తాలు విక్రయించగా.. రూ.23లక్షల 40వేల రూపాయలు వచ్చాయి. అందులో కమీషన్లు, పన్నులు పోగా రూ.21లక్షలు చేతికి వచ్చాయని ప్రసాదరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

farmer feels happy for getting high price to badiga type of chilli in guntur mirchi yard
బాడిగలో మేలు రకానికి రికార్డు ధర.. ఆనందంలో రైతు

By

Published : Dec 22, 2020, 10:17 PM IST

గుంటూరు మిర్చియార్డులో బాడిగ రకం మిర్చికి రికార్డు ధర పలికింది. ఈ రకం మిర్చి క్వింటా రూ.36వేలకు అమ్ముడుపోయింది. కర్నూలు జిల్లాకు చెందిన ప్రసాదరెడ్డి అనే రైతు.. గుంటూరు యార్డుకు బాడిగ పంట తీసుకువచ్చారు. బాడిగలో మేలురకం కాయలుకావటంతో అత్యధిక ధర పలికింది. మొత్తం 131 బస్తాలను విక్రయించగా.. క్వింటాకు రూ.36 వేలు రైతుకు వచ్చాయి.

గతంలో గుంటూరు మార్కెట్​లో.. తేజ రకం అత్యధికంగా క్వింటాకు రూ.24వేల పలికింది. బాడిగ రకం ఎక్కువగా కర్నాటక మార్కెట్​కు వెళ్తుంది. కర్నాటక మార్కెట్లోనూ.. ప్రస్తుతం ఈ రకానికి క్వింటా రూ.30వేల వరకూ ధర పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బాడిగ రకానికి మంచి డిమాండ్ ఉంది. ఈ రకం మిర్చిని ఎక్కువగా పొడి కోసం వినియోగిస్తారు. ఏ రకం వెరైటీలోనైనా సులువుగా కలిసిపోతుంది. 131బస్తాలకు గాను.. మొత్తం రూ.23లక్షల 40వేల రూపాయలు వచ్చాయి. అందులో కమిషన్లు, పన్నులు పోగా రూ.21లక్షలు చేతికి వచ్చాయని ప్రసాదరెడ్డి సంతోషం వెలిబుచ్చారు.

ABOUT THE AUTHOR

...view details