గుంటూరు జిల్లా తాడికొండలో విద్యుదాఘాతం కౌలు రైతును బలితీసుకుంది. గ్రామానికి చెందిన షేక్ అఫ్జల్ (60).. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ఏడాది నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. రెండు ఎకరాల్లో మినుములు... మరో రెండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి పత్తి చేను నీటితో నిండిపోయింది.
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృత్యువాత
గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో విషాదం జరిగింది. వర్షం కారణంగా పొలంలో నిలిచిన నీటిని బయటకు తోడేందుకు వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
farmer died with electric shock in Tadikonda
ఆదివారం వాటిని విద్యుత్తు మోటారుతో బైటకు తోడేందుకు రైతు ప్రయత్నించాడు. పొలం పక్కన ఉన్న అతని ఇంటి నుంచి మోటారుకు విద్యుత్తు కనెక్షన్ ఇచ్చే క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు మహబూబ్ సుభాని ఇ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ రాజశేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు.