గుంటూరు జిల్లా రాయపూడిలో విషాదం జరిగింది. పోలీసులు వస్తున్నారనే భయంతో పరుగులు పెట్టిన ఓ రైతు కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పలువురు ఊరి చివర ఉన్న చెట్లకింద కూర్చున్నారు. పోలీసులు వస్తున్నారని తెలిసి అక్కడున్న వారంతా పరుగు తీయగా... షేక్ జాఫర్(55) వేగంగా వెళ్తూ గుండెపోటుతో చనిపోయారు. పోలీసుల భయంతోనే జాఫర్ గుండెపోటుకు గురై మృతిచెందినట్లు బంధువులు ఆరోపించారు.
పోలీసుల భయంతో పరుగు.. గుండెపోటుతో కూలీ మృతి - guntur latest crime news
పోలీసులు వస్తున్నారన్న భయంతో పరుగుపెట్టిన ఓ రైతు కూలీ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రాయపూడిలో జరిగింది.
![పోలీసుల భయంతో పరుగు.. గుండెపోటుతో కూలీ మృతి పోలీసుల భయంతో పరుగు.. గుండెపోటుతో మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6745260-823-6745260-1586574520508.jpg)
పోలీసుల భయంతో పరుగు.. గుండెపోటుతో మృతి
ఆరోపణల్లో వాస్తవం లేదు: డీఎస్పీ
పోలీసులు వెంటపడినందునే జాఫర్ చనిపోయాడని మృతుడి బంధువులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆటలాడుతున్న పిల్లలను ఇళ్లకు వెళ్లాలని తుళ్లూరు కానిస్టేబుల్ రామయ్య చెప్పారు. ఈ నేపథ్యంలో వారంతా పరుగు తీశారు. అదే సమయంలో చెట్ల కింద కూర్చున్న వారు పరుగుతీయగా.. జాఫర్ గుండెపోటుకు గురయ్యారని డీఎస్పీ చెప్పారు.