పొలంలో పని చేస్తుండగా ట్రాక్టర్ రోటావేటర్‌లో పడి ఓ రైతు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన రైతు బండి వెంకటేశ్వర్లు (50) తన వ్యవసాయ భూమిని రోటావేటర్‌తో దున్నించేందుకు బుధవారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్‌తో కలిసి వెళ్లారు.
పొలం దున్నే సమయంలో వెంకటేశ్వర్లు ట్రాక్టర్ ఎక్కబోయి.. జారిపడి ప్రమాదవశాత్తూ రోటావేటర్‌లో పడిపోయాడు. వేగంగా తిరుగుతున్న యంత్రంలోని బ్లేడ్లు వెంకటేశ్వర్లును లోనికి లాగేశాయి. డ్రైవర్ గమనించి, ట్రాక్టర్ ఆపే లోపే ఆయన అక్కడికక్కడే మరణించాడు. బయటికి తీసేందుకూ వీల్లేనంతగా శరీరం అందులో చిక్కుకుపోయింది.