గుంటూరు జిల్లా రేపల్లె మండలం వాకావారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనికి వెళ్లి పాముకాటుకు ఓ రైతు మృతి చెందాడు. వాక రామకృష్ణ నారుమడిలో పని చేస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే సమాచారం తెలుసుకున్న కుంటుంబసభ్యులు రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా రామకృష్ణ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు.
వాకావారిపాలెంలో పాముకాటు.. రైతు మృతి - snake bite
రాష్ట్రంలో పాముకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల అనేకమంది పాముకాటుతో మృత్యువాతపడ్డారు. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె మండలం వాకావారిపాలెంలో పొలం పనులకు వెళ్లిన ఓ రైతు పాముకాటుకు గురై.. మృతి చెందాడు.

పాము కాటుతో రేపల్లె రైతు మృతి