గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడిలో విషాదం జరిగింది. అప్పుల బాధతో చెన్నుపాటి రాఘవయ్య పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నుపాటి రాఘవయ్య తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశారు. అకాల వర్షం దెబ్బతీసింది. దీనికి తోడు గిట్టుబాటు ధర లేకపోవడంతో పది లక్షల అప్పులు మిగిలాయి. వాటిని తీర్చే మార్గం కనిపించక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య - farmer suicide at guntur
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్చీ పంట సాగు చేసి నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే దారి కనిపించక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య