గుంటూరు జిల్లా తెనాలి మండలం ఖాజీపేట గ్రామానికి చెందిన సుంకర ప్రసన్నాంజనేయులు అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తెచ్చి పంటలు వేయగా.. భారీ వర్షాల కారణంగా చేతికి అందివచ్చిన పంట నీట మునిగింది. దీంతో వరదలు, తుపానుల కారణంగా పైకి చేతికి రాలేదు. దీంతో మనస్తాపానికి చెందిన ప్రసన్నాంజనేయులు ఈ నెల 9న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు.
అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య - గుంటూరు వార్తలు
అప్పుల బాధ తాళలేక కౌలురైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి మండలం ఖాజీపేటలో జరిగింది. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుని బంధువులు తెలిపారు.
farmer died in guntur