ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని తరలిపోతుందనే బెంగతో రైతు మృతి - అమరావతి రైతుల నిరసన వార్తలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు మృతి చెందాడు. గత పది రోజులుగా కృష్ణాయపాలెంలో జరుగుతున్న రైతుల ఆందోళనలో ఆయన పాల్గొన్నాడు. రాజధాని తరలిపోతుందనే బెంగతో గత రెండు రోజులుగా ఆందోళన చెందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం తమకు ఉన్న అర ఎకరం పొలం ఇచ్చామని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్ అంధకారం అవుతుందనే ఆందోళనతో గుండెపోటుకు గురై... తన తండ్రి మృతి చెందాడని ఆయన కుమారుడు బుల్లిబాబు చెప్పాడు.

farmer died at amaravati protest
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

By

Published : Jan 8, 2020, 2:54 PM IST

రాజధాని తరలిపోతుందనే బెంగతో రైతు మృతి...

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details