గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. వాళ్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో పంటకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని వివరించారు. వైఎస్సార్ జలకళ పేరిట పొలాల్లో ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేస్తుందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఉండవల్లి శ్రీదేవి - పొలాల్లో ప్రభుత్వమే ఉచితంగా బోర్లు
ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. కేంద్ర మాజీ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి