ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధతో నిమ్మ రైతు ఆత్మహత్య - దుండిపాలెం రైతు ఆత్మహత్య న్యూస్

పంట దిగుబడి తగ్గటం, సరైన ధర రాకపోవటం ఆ రైతును కుంగదీశాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పును ఎలా తీర్చాలా అన్న మనోవేదన ఎక్కువైంది. చివరికి ఆ రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా దుండిపాలెంలో జరిగింది.

farmer suicide
రైతు ఆత్మహత్య

By

Published : Dec 21, 2020, 12:00 PM IST

గుంటూరు జిల్లా చుండూరు మండలం దుండిపాలెంలో నిమ్మ రైతు... పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన పోతురాజురెడ్డి.. 20 ఎకరాల నిమ్మతోటను కౌలుకు తీకున్నారు. దిగుబడులు తగ్గటం, పంటకు సరైన ధర లేక తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడుల కోసం 20 లక్షల మేర అప్పులు చేశారు.

రుణ బాధతో మనోవేదనకు గురైన పోతురాజురెడ్డి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు పోతురాజురెడ్డిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి అతను చనిపోయారు. చుండూరు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details