ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైన్​ గేట్లు ఎతివేయాలంటూ రహదారిపై రైతుల ఆందోళన - repalle drain main gates

గుంటూరు జిల్లా రేపల్లెలోని డ్రైన్​ గేట్లు ఎత్తివేయాలంటూ, రహదారి దిగ్భందనం చేశారు అన్నదాతలు. గత నాలుగు రోజులుగా వరద నీటి ప్రవాహానికి డ్రైన్​ కోతకు గురై తమ పొలాలు మునిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల ఆందోళన

By

Published : Sep 20, 2019, 7:56 PM IST

డ్రైన్​ గేట్లు ఎతివేయాలంటూ రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా చెరుకుపల్లి-రేపల్లె ప్రధాన రహదారిని రైతులు దిగ్భందించారు.ట్రాక్టర్ ను అడ్డుగా పెట్టి రైతులు ఆందోళనకు దిగారు.గత నాలుగు రోజులుగా వరద నీటి ప్రవాహానికి స్థానికంగా ఉన్న డ్రైన్ కోతకు గురవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మండలంలోని గూడవల్లి నుంచి నిజాంపట్నం వరకు రేపల్లె ప్రధాన మురుగుకాలువ ఉంది.నీటి ప్రవాహం పెరగడంతో డ్రైన్ కు ఇరువైపులా కట్ట కోతకు గురైంది.దీనిని అరికట్టడానికి గతంలో అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు.ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందించి రేపల్లె ప్రధాన డ్రైన్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.గేట్లు ఎత్తకపోతే తమ పొలాలు మునిగిపోతాయని వాపోయారు.గత కొద్ది రోజులుగా వస్తున్న నీటి ప్రవాహానికి డ్రైన్లు అధ్వానంగా మారాయని ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details