ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ బదిలీలు రద్దు చేయాలని ఫ్యాప్టో సభ్యులు ఆందోళన - ఉపాధ్యాయుల బదిలీలు తాజా వార్తలు

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు డీఈవో కార్యాలయం ఎదుట ఫ్యాప్టో సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. డీఈవోను కలసి వినతి పత్రం అందజేసిన వారు... తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు.

fapto members protest in deo office
అక్రమ బదిలీలు రద్ద చేయాలని ఫ్యాప్టో సభ్యులు ఆందోళన

By

Published : Jul 15, 2020, 5:22 PM IST

గుంటూరు డీఈవో కార్యాలయం ఎదుట ఫ్యాప్టో సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్రమ బదిలీలు పైన విచారణ జరిపి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డీఈవోను కలసి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను తక్షణమే రద్దు చేసి.. బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ బసవలింగరావు డిమాండ్ చేశారు. బదిలీల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలన్న వారు... జీవో నెంబర్ 342ను యధావిధిగా కొనసాగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయులకు స్టడీ లీవ్​ను నిరకరించే మోమో 820, 339లను రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details