ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పూర్వీకులు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో నివాసం ఉండేవారు. బాలు తండ్రి సాంబమూర్తి... చిన్న వయసులోనే నెల్లూరు జిల్లాకు వలస వెళ్లారు. సాంబమూర్తి ఈమని చుట్టుపక్కల ప్రాంతాల్లో హరికథా కాలక్షేపం చేసేవారు. బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రి పూర్వీకులు కూడా ఇదే గ్రామానికి చెందిన వారు కావటం విశేషం. బాలుతో తమకున్న అనుబంధాన్ని వారి బంధువులు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
మూలాలు గుంటూరులో.. స్థిరపడింది నెల్లూరులో - ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్బహ్మణ్యం మూలాలు
ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లాకు చెందిన వారనే విషయం అందరికీ తెలుసు. అయితే ఆయన మూలాలు గుంటూరు జిల్లాలో ఉన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. ఎస్పీబీ పూర్వీకులు దుగ్గిరాల మండలంలోని ఈమనికి చెందినవారు కావడం గమనార్హం.
ఈమని గుంటూరు జిల్లా