మామ, అల్లుడి మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు - family fight in dachepalli news
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో భార్య కాపురానికి రాక పోవడం మామా అల్లుళ్ళ మధ్య వివాదానికి దారి తీసింది. మాటా మాటా పెరిగి రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సుమారుగా నలుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు గురజాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని గుంటూరు తరలించారు.