ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కుటుంబ సమస్యల పరిష్కారమే లక్ష్యం' - gunturu news today

గుంటూరు దిశ పోలీస్ స్టేషన్​ ప్రాంగణంలో పరిష్కృత పేరుతో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటైంది. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

Family counselling center established in guntur
పరిష్కృత కేంద్రాన్ని ప్రారంభించిన గుంటూరు అర్బన్ ఎస్పీ

By

Published : Aug 12, 2020, 7:47 PM IST

కుటుంబ సభ్యుల మధ్య వివాదాల పరిష్కారమే.. 'పరిష్కృత' ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం ముఖ్య ఉద్దేశమని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. స్థానిక దిశ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్న ప్రస్తుత పరిస్థితిలో వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details