గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండులోని ఏ ఎన్ ఎల్ పార్శిల్ సర్వీస్ సెంటరులో రూ.2.35లక్షల విలువైన బయో ఉత్పత్తులను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.మాచెర్ల నుంచి రాజమహేంద్రవరానికి నకిలీ బయో ఉత్పత్తులను తరలిస్తున్నారన్న సమాచారంతో,తనిఖీలు చేయగా ఈ ఉత్పత్తులు లభించాయని వ్యవసాయ అధికారి సునీల్ కుమార్ తెలిపారు.పట్టుబడిన బయో ఉత్పత్తులకు ఎటువంటి అనుమతులు లేవని ఆయన వెల్లడించారు.నకిలీ పురుగు మందులను నిందితులు మెడికల్ బాక్సులుగా చిత్రీకరించి రాజమహేంద్రవరానికి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేశామని,తదుపరి చర్యులు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
గుంటూరులో నకిలీ పురుగుల మందు పట్టివేత - గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండులో నకిలీ మందులు పట్టివేత
గుంటూరు జిల్లాలో నకిలీ పురుగు మందుల కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండులోని ఏఎన్ఎల్ పార్శిల్ సర్వీస్ సెంటరులో రూ. 2.35 లక్షల విలువైన బయో ఉత్పత్తులను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
![గుంటూరులో నకిలీ పురుగుల మందు పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4823270-859-4823270-1571656477224.jpg)
2.35 లక్షల విలువైన బయో ఉత్పత్తులు స్వాధీనం