డబ్బులు సులభంగా సంపాదించాలనే అత్యాశతో గురజాలకు చెందిన ఓ ముఠా... నకిలీ రూ. 500 నోట్లను తయారీ చేశారు. వాటిని పట్టణంలోని ఫ్రూట్ మార్కెట్లోని ఓ వ్యక్తి దగ్గరకు వచ్చి మార్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో అనుమానం వచ్చిన వ్యాపారి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వారిని చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. నిందితలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పుకొచ్చారు.