గుంటూరు జిల్లాలో రూ.2 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ కట్టలు కలకలం రేపింది. ఏటుకూరు బైపాస్ వెంగలాయపాలెం గ్రామం వద్ద అనుమానాస్పద బ్యాగు ఉందని సమాచారం అందుకున్న పోలీసులు అందులో నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించారు. నకిలీ 2 వేల నోట్ల కట్టలు 119, నకిలీ 500 రూపాయల నోట్ల కట్టలు 17 స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ డిపాజిట్ యంత్రాల్లో నకిలీ నోట్లు డిపాజిట్ చేసి.. ఇతర ఏటీఎమ్‌ల ద్వారా నగదు విత్ డ్రా చేసుకుంటున్న ఉదంతాలు ఇటీవల వెలుగుచూస్తున్నాయని పోలీసులు తెలిపారు. బ్యాగు దొరికిన మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.
రూ.2కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించిన పోలీసులు - గుంటూరులో నకిలీ నోట్లను గుర్తించిన పోలీసులు
గుంటూరు జిల్లాలో రూ.2 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ కట్టల కలకలం రేపింది. ఏటుకూరు బైపాస్ వెంగలాయపాలెం గ్రామం వద్ద అనుమానాస్పద బ్యాగు ఉందని సమాచారం అందుకున్న పోలీసులు అందులో నకిలీ కరెన్సీని గుర్తించారు.
రూ.2కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించిన పోలీసులు