ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

200 నోటును చింపేసి.. 2వేల నోటు తయారుచేశారు.. దొరికిపోయారు..! - ap news

నకిలీ కరెన్సీ ముద్రించి చలామణీ చేస్తున్న ముఠాను తెనాలి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరిపై భీమవరం, హైదారాబాద్​ పోలీస్టేషన్లలో గతంలో కేసులు నమోదయ్యాయి.

200 నోటును చింపేసి.. 2వేల నోటు తయారుచేశారు.. దొరికిపోయారు..!

By

Published : Jul 30, 2019, 1:33 PM IST

దొంగ నోట్లు అచ్చేసి..దొరికిపోయారు!
గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు నకిలీ నోట్లు ముద్రించే ముఠాను అరెస్ట్​ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సురేష్​, సీతారామయ్య మరో ముగ్గురిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి..రిమాండ్​కు తరలించారు. నిందితులు 200 నోటులోని ఆర్బీఐ త్రెడ్​ను, గాంధీ బొమ్మలు సేకరించి నకిలీ 2వేల నోటులో అమర్చి చలామణీ చేస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి వ్యాపారి అందించిన సమాచారంతో పోలీసులు వారిని అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 35వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details