ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fake Currency: నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? - దొంగ నోట్ల ముఠా అరెస్టు

Fake Currency gang arrest: గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు చలామణి ముఠా గుట్టు రట్టయింది. దొంగ నోట్లతో మద్యం కోనుగోలు చేసిన నకిలీగాళ్లు అడ్డంగా బుక్కయ్యారు. ఈ కేసులో ఏడుగురుని అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి రూ.45 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు
నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు

By

Published : Dec 26, 2021, 7:41 PM IST

Updated : Dec 26, 2021, 8:26 PM IST

నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు

Fake Currency gang arrest:గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 45 లక్షల విలువైన నకిలీ నోట్లు, రెండు కార్లు, ప్రింటర్లు, స్కానర్, కంప్యూటర్, పత్రాలు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. మేడికొండూరు వైన్ షాప్​లో పనిచేస్తున్న సేల్స్​మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మేడికొండూరు వైన్​షాప్​కి ఈనెల 22న ఇద్దరు వ్యక్తులు రూ. 200 నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేశారు. కాసేపటికి అవి నకిలీ నోట్లని గుర్తించిన వైన్స్​ సేల్స్​మెన్ మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పేరేచర్ల వద్ద ముగ్గరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. నకిలీ నోట్ల ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో కలర్ జీరాక్స్ సాయంతో రూ. 200, 500 నోట్లను తయారుచేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. కేసులో ఉడతూరి వెంకట నారాయణ రెడ్డి, అతనికి సహకరిస్తున్న శ్రీనివాసరావు, జానీ బాషాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లు, వాటిని తయారు చేస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

దొంగ నోట్ల వ్యవహారంలో శ్రీనివాసరావు గతంలోనూ పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతను నకిలీ నోట్లు ముద్రించటంలో దిట్ట అని తెలిపారు. సునాయాసంగా డబ్బులు సంపాదించడానికి నిందితులు ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్నారని చెప్పారు. వెంకటనారాయణ రెడ్డి ముద్రించిన నోట్లను అసలు నోటుకు నాలుగు నకిలీ నోట్లు ఇచ్చేలా ఒప్పదం చేసుకుని వాటిని జెట్టి కిషోర్, పంతగాని పూర్ణచంద్రరావు, దేవళ్ల శ్రీనివాస్​తో పాటు మరో వ్యక్తి చలామణి చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు మొత్తం 2.2 లక్షల నకిలీ నోట్లు మార్కెట్​లో చెలామణి చేసినట్లు చెప్పారు. నిందితులు గుంటూరు, రెంటచింతల, దుర్గి, దాచేపల్లి, అచ్చంపేట, ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా గుర్తించామన్నారు.

సైబర్ నేరాలు, నకిలీ నోట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎవరైనా సైబర్​ ఉచ్చులో చిక్కి మోసపోతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలన్నారు.

ఇదీ చదవండి

Mother and daughter died in mulugu : కుమార్తె మరణ వార్త విని.. ఆగిన తల్లి గుండె!

Last Updated : Dec 26, 2021, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details