ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరుగాలం కష్టానికి నకిలీ మకిలి..! - fake chilli seeds in siripuram

పంట వేసేందుకు అప్పుచేసి విత్తనాలు కొన్నారు. నారు ఏపుగా పెరుగింది. పంట పండింది అనుకున్న రైతుకు నిరాశే మిగిలింది. తాము వేసింది నకిలీ విత్తనాలని ఆలస్యంగా తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా సిరిపురం మిరప రైతులు.

fake chilli seeds in siripuram
నకిలీ విత్తనాలతో మోసపోతున్న రైతాంగం

By

Published : Dec 25, 2019, 1:16 PM IST

ఆరుగాలం కష్టానికి నకిలీ మకిలి..!

పొలంలో వేసిన విత్తనాలు నకిలీవని తెలిసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ మకిలీతో పంట చేతికి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా సిరిపురం మిరప రైతులు. యూఎస్ త్రీ ఫోర్ వన్ అనే మిరప రకం సాగు చేశామని... మెుదట పంట మామూలుగానే ఎదిగినా... తర్వాత ఆకుముడత వచ్చి ఎదుగుదల ఆగిపోయిందని చెబుతున్నారు.

పూత, పిందే రావటంలేదని ఎన్ని మందులు పిచికారి చేసినా ప్రయోజనం లేదని వాపోయారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశామని చెప్పారు. ఇలా నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'మా పోరాటానికి సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details