గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జనసేన కార్యకర్తపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. తోట నాగవేణు చిలకలూరిపేటలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. వేణు ఫేస్‌బుక్‌లోని ఓ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. ఆ గ్రూప్‌లో నిరుపేద కాపులకు సహాయం చేసేందుకు సేకరించిన నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించాడు. ఈ క్రమంలో సదరు ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ తదితరులు పోస్టుల రూపంలో ఒకరినొకరు దూషించుకున్నారు. నాగవేణుకు తగిన బుద్ధి చెబుతామని బెదిరిస్తూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో వాటర్ ప్లాంట్‌లో ఉన్న నాగవేణుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు.
పోస్టుల వివాదం.. జనసేన కార్యకర్తపై కర్రలతో దాడి - janaseena political issues latest news
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జనసేన కార్యకర్తపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. వాహనాల్లో వచ్చి తోట నాగవేణును కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన వేణు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
![పోస్టుల వివాదం.. జనసేన కార్యకర్తపై కర్రలతో దాడి face book post issue attack on janaseena activist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10436811-723-10436811-1612004847280.jpg)
face book post issue attack on janaseena activist
నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించిన తనను హత్య చేసేందుకు యత్నించారని నాగవేణు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగవేణు మీద దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.
జనసేన కార్యకర్తపై కర్రలతో దాడి
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టిపెడతాయి: ఎస్‌ఈసీ