ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FACEBOOK CHEATER: అమ్మాయి ఖాతాతో నీలిచిత్రాలు పంపాడు.. పోలీసులకు చిక్కాడు - గుంటూరు అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా వార్తలు

అందమైన అమ్మాయి ఫొటోతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. అయిదు వేల మంది అనుసరించేలా చేసుకున్నాడు. వారిలో కొందరి ఫొటోలు సేకరించి మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. గుంటూరుకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో అతడు పోలీసులకు చిక్కాడు.

face book cheater
face book cheater

By

Published : Aug 12, 2021, 9:00 AM IST

అమ్మాయి ఫొటోతో ఫేస్​బుక్ ఖాతా తెరిచి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మగవారితో అమ్మాయిల మాట్లాడటం, మహిళలతో స్నేహితుడిలా మాట్లాడుతూ వారికి నీలి చిత్రాలు పంపేవాడు. ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులకు చిక్కాడు.

గుంటూరు పశ్చిమ డీఎస్పీ సుప్రజ తన కార్యాలయంలో బుధవారం నిందితుడి వివరాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా నడికుడి గ్రామానికి చెందిన గూనెల క్రాంతికుమార్‌ 10వ తరగతి చదివాడు. ఇతను లావణ్యరెడ్డి అనే పేరుతో 2019లో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. మగవారితో అమ్మాయిలాగా, మహిళలతో ఫ్రెండ్‌లాగా ఛాటింగ్‌ చేస్తుండేవాడు. ఇలా అయిదువేల మందిని తన ఫాలోవర్స్‌గా చేసుకున్నాడు. బాగా చనువుగా మాట్లాడే అమ్మాయిలకు నీలిచిత్రాలు పంపిస్తుండేవాడు. ఈ క్రమంలో క్రాంతికుమార్‌ ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అదే యాప్‌ను గుంటూరుకు చెందిన ఓ వివాహిత డౌన్‌లోడ్‌ చేసుకుంది. యాప్‌లోని సభ్యులందరి ఫొటోలను పరిశీలించిన క్రాంతికుమార్‌కు ఆ యువతి ప్రొఫైల్‌గా పెట్టుకున్న ఫొటో అందంగా ఉండటంతో అతని కన్నుపడింది. వెంటనే ఆమెకు వాట్సప్‌ ద్వారా వీడియో కాల్‌ చేశాడు. ఆమె కాల్‌ లిఫ్ట్‌ చేసి గుర్తుతెలియని వ్యక్తని భావించి కట్‌చేసింది. 15 సెకన్లపాటు ఆ వీడియో కాల్‌ పరిశీలించింది. అంతలోనే క్రాంతికుమార్‌ ఆమె వీడియోకాల్‌ మాట్లాడుతున్నప్పటి ఫొటోలను స్క్రీన్‌షాట్‌గా తీసి ఆమెకు పంపించాడు. ఆమె అతని నంబర్‌ను బ్లాక్‌చేసింది. ఈక్రమంలో క్రాంతికుమార్‌ తాను ఎవరనేది తెలియకుండా ఉండటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేరే వాళ్ల ఫోన్‌, వాట్సప్‌ నంబర్ల ద్వారా ఆ యువతికి ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పంపించి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదేశాలతో డీఎస్పీ సుప్రజ, సీఐ నరేష్‌కుమార్‌లు సాంకేతిక పరిజ్ఞానంతో అతడిని గుర్తించారు. బుధవారం గుంటూరు లాడ్జిసెంటర్‌ వద్ద క్రాంతికుమార్‌ను సీఐ నరేష్‌కుమార్‌ తమ బృందంతోవెళ్లి అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:CALL ME ANYTIME FRAUD: నగ్న వీడియో కాల్‌ రికార్డు చేసి.. ఉన్నదంతా దోచేసి..

ABOUT THE AUTHOR

...view details