ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారంపూడి పోలీసుస్టేషన్ ఎదుట ఉద్రిక్తత.. డ్రైవర్​ను వదిలేయాలంటూ ఆందోళన - గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా కారంపూడి పోలీసుస్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత జరిగింది. మద్యం తాగి ఉన్న డ్రైవర్‌ను పోలీసు స్టేషన్​కు తరలించారన్న కారణంతో.. ట్రాక్టర్​లో ఉన్న వారు స్టేషన్​ ముందు ఆందోళన చేశారు. ఉద్రిక్తతకు దారి తీయడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.

మద్యం తాగి
మద్యం తాగి

By

Published : Oct 3, 2021, 10:46 PM IST

మద్యం తాగి ఉన్న డ్రైవర్‌ను పోలీసు స్టేషన్​కు తరలించారన్న కోపంతో ట్రాక్టర్​లో ఉన్న వారు పోలీసు స్టేషన్​ ముందు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు జిల్లా శ్యావల్యాపురం మండలంలోని కారుమంచికి చెందిన పలువురు దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని నిదానంపాటి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో పోలీసులు.. ట్రాక్టర్​ను అడ్డుకున్నారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడన్న కారణంతో పోలీసు స్టేషన్​కు తరలించారు.

స్టేషన్ ఎదుట ఆందోళన.. లాఠీఛార్జ్

డ్రైవర్​ను అరెస్ట్ చేయడంతో.. ట్రాక్టర్​లో ఉన్నవారు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి.. అక్కడ్డున్న వారిని చెదరగొట్టారు. నిబంధనలను ఉల్లంఘించినందుకే అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.


ఇదీ చదవండి:Theft: తాడేపల్లిలో చోరీ.. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ

ABOUT THE AUTHOR

...view details