Extreme Temperatures in the State: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతల తీవ్రత స్వల్పంగా తగ్గినా.. సగటు ఉష్ణోగ్రతలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీల వరకూ నమోదు అవుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు వరకూ సగటు ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టు భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉష్ణగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఏప్రిల్ 17 తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమల్లో వీటి ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం 160కి పైగా మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా నంద్యాల జిల్లా జువ్విగుంటలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. కడప 42.66, పలాస 42.49, కడప సిద్ధవటం 42.5, విజయనగరం గుర్ల 42.07, ఒంటిమిట్ట 41.8, ప్రకాశం 41.69, నెల్లూరులో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
విశాఖలో 41.46, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.42, కంభంలో 41.41, తిరుపతిలో 41.36, పలనాడులో 41.25, అనకాపల్లిలో 41.21, పార్వతీపురంలో 40.11 డిగ్రీలు, ధవళేశ్వరంలో 40.15, ఏలూరు 40.44, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల 40.73, బాపట్ల 40.09, గుంటూరు 39.5, ఒంగోలు 40.8, నెల్లూరు 40, చిత్తూరు 40.08, కర్నూలు 39.7,అనంతపురం 40.26, సత్యసాయి జిల్లా 40.36, అన్నమయ్య జిల్లా 41.08, భీమవరం 36.26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.