ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు...ఎందుకంటే..!

మొక్కలు నాటే పథకంలో అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఓ వ్యక్తికి గ్రామ పెద్దలు జరిమానా విధించారు. గడువులోపు సొమ్ము చెల్లించలేదని దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడని అతని కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారు.

Expulsion of the family by  The village elders in ramnagar, bapatla mandal in guntur district
Expulsion of the family by The village elders in ramnagar, bapatla mandal in guntur district

By

Published : Jun 8, 2020, 12:04 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల మండలం రాంనగర్‌లో మత్స్యకారుడి కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారు. మొక్కలు నాటే పథకంలో నాగరాజు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు అతనికి గ్రామ పెద్దలు రూ.2.50 లక్షలు జరిమానా విధించారు. గడువులోపు నాగరాజు డబ్బులు చెల్లించకపోవడంతో 2 వారాల క్రితం గ్రామ పెద్దలంతా దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు నాగరాజు కుటుంబాన్ని వెలివేసినట్లు ప్రకటించారు. చేపల వేటకు సైతం వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.

ABOUT THE AUTHOR

...view details