కలుషిత ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. కాలం చెల్లిన తినుబండారాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలు తిని.. చాలామంది ఆనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల.. విరేచనాలు, వాంతులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉదర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు కొంతకాలం ఇంటి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల.. ప్యాకేజ్డ్ తినుబండారాలు, బేకరీ పదార్థాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత మళ్లీ యథా మామూలే. బేకరీలు, హోటళ్ల తిండి కోసం జనం క్యూ కడుతున్నారు. బయటి పదార్థాలు కొనే ముందు ఎక్కువమంది కాలం చెల్లిన తేదీ వివరాలు చూసుకోకపోవడం.. ఎక్కువ నష్టం కలిగిస్తోంది.
బేకరీల్లో తయారుచేసే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ప్యాకేజ్డ్ వస్తువులుఎప్పుడు తయారు చేశారు, కాలం ఎప్పడు తీరుతుందనే వివరాలు కూడా చాలావరకు ఉండటం లేదు. ఇలాంటివి కూడా సమస్యలకు కారణమవుతున్నాయి.