Southwest Monsoon 2023 Updates : బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు సహా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాగల రెండు రోజుల్లో శ్రీలంక సమీపంలోని కామోరిన్ ప్రాంతంతో పాటు మాల్దీవులకు రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణగాలుల ప్రభావం క్రమంగా తగ్గుతోందని వాతావరణశాఖ తెలిపింది. రాగల రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
రుతు పవనాల రాక అలస్యం : నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు సహా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాగల రెండు రోజుల్లో శ్రీలంక సమీపంలోని కామోరిన్ సహా మాల్దీవులు పరిసర ప్రాంతాలకు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. వాస్తవానికి జూన్ 1 తేదీ నాటికే నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నా.. బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా రుతుపవనాలు కేరళలో ప్రవేశించేందుకు ఆలస్యమవుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : షాక్ కొడుతున్న విద్యుత్ స్తంభాలు.. భయాందోళనలో ప్రజలు