ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో అర్థరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు - గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో గుప్తా నిధుల కోసం ఓ ముఠా తవ్వకాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదుగురులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Excavations in Guntur District for Guptas nidhulu
Excavations in Guntur District for Guptas nidhulu

By

Published : May 18, 2020, 11:50 PM IST

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామంలో అర్ధరాత్రి ఓ ముఠా గుప్తా నిధుల కోసం తవ్వకాలు జరిపింది. గుప్త నిధుల కోసం పలువురు గ్రామంలోకి ప్రవేశించి తవ్వకాలు చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పిడుగురాళ్ల అమరావతి ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులుగా గుర్తించారు. అందులో ఇద్దరు వ్యక్తులను పోలీసుల అదుపులో తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన వారి కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details