ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో నామినేషన్ల పరిశీలన

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లాలో నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. కొన్ని గ్రామాలలో కేవలం ఒక్కరూ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. 2న అభ్యంతరాల స్వీకరణ , 3న ఎన్నికల అధికారులు నిర్ణయం, 4న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

Examination of nominations in Guntur district
గుంటూరు జిల్లాలో నామినేషన్ల పరిశీలన

By

Published : Feb 1, 2021, 4:38 PM IST

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ పరిశీలన ముగియనుంది. 2వ తేదీన అభ్యంతరాల స్వీకరణ 3వ తేదీన అభ్యంతరాలపై ఎన్నికల అధికారులు నిర్ణయం , 4న నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. కొన్ని పంచాయతీల్లో ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. అలాంటివి ఏకగ్రీవం కానున్నాయి. అంతకన్నా ఎక్కువ నామినేషన్లు వచ్చిన చోట ఎన్నికలు జరుగుతాయి.

4వ తేదీ వరకూ ఉపసంహరణకు గడువుండటంతో ఏకగ్రీవాల అంశంపై అప్పటికి పూర్తి స్పష్టత వస్తుంది. గుంటూరు జిల్లాలో మొదటి విడతలో తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 337 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఇదీ చూడండి.సీఎస్, మాజీ సీఎస్ నీలం సాహ్ని, ద్వివేదికి హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details