ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో మాజీ సైనికుడు మృతి... మృతదేహం తీసుకొస్తూ మరో వ్యక్తి మరణం - Ex-soldier died news

గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన మాజీ సైనికుడు పూర్ణచంద్రరావు కరోనా సోకి మృతి చెందారు. ఆస్పత్రి నుంచి అతని మృతదేహాన్ని తీసుకొస్తుండగా దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రావూరి కోటేశ్వరరావు అనే వ్యక్తి మరణించాడు.

death
మృతి చెందిన సైనికుడు

By

Published : May 30, 2021, 9:37 AM IST

గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన మాజీ సైనికుడు బొల్లా పూర్ణచంద్రరావు కరోనా బారిన పడి మరణించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ పొందిన​పూర్ణచంద్రరావు గుంటూరులో నివాసమున్నారు. కరోనా సోకిన కారణంగా.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతూ.. నిన్న రాత్రి మృతి చెందారు.

పూర్ణచంద్రరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్తుండగా.. ఫిరంగిపురం సమీపంలో అంబులెన్స్​, కారు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భౌతికకాయాన్ని తీసుకెళ్తున్న రావూరి కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించాడు.

ABOUT THE AUTHOR

...view details